Ad Code

టెస్లా వైఎల్ కారు డెలివరీలు ప్రారంభం

దేశంలో టెస్లా లాంచ్ చేసిన మోడల్ వైఎల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. 6-సీటర్ ఎలక్ట్రిక్ SUV రూపంలో లాంచ్ అయిన ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ మోడల్ కంటే కూడా విశాలమైన క్యాబిన్‌ పొందుతుంది. ఇది 2+2+2 సీట్ల అమరికలో ఉంటుంది. మోడల్ YLలో 16-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం 8-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్, 2వ వరుస సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, 19-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. మోడల్ YL డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఇది 5.0 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని. ఇది ఒక ఫుల్ ఛార్జితో 681 కి.మీ రేంజ్ అందిస్తుందని టెస్లా పేర్కొంది. 

Post a Comment

0 Comments

Close Menu