Ad Code

ప్రధాని మోడీకి స్లోవేకియా జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ప్రదానం

భారత ప్రధాని నరేంద్ర మోడీ స్లోవేకియా అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ను అందుకున్నారు. బ్రాటిస్లావాలో స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రధాని మోడీ ఈ గౌరవాన్ని భారత్, స్లోవేకియాల మధ్య స్నేహానికి అంకితం చేశారు. ప్రధాని మోడీకి ఇది 33వ అంతర్జాతీయ పురస్కారం. ఈ పురస్కారం ప్రధాని మోడీ ఓ ట్వీట్ చేశారు. ''140 కోట్ల భారత ప్రజలకు దక్కిన గౌరవం, ఈ గౌరవాన్ని అందించిన స్లోవేకియా ప్రజలకు, ప్రభుత్వానికి కృతజ్ణతలు. ఈ పురస్కారాన్ని భారత్, స్లోవేకియా ల మధ్య శాశ్వత స్నేహానికి అంకితం చేస్తున్నాను'' అని పోస్ట్ షేర్ చేశారు. భారత్, స్లోవేకియా ప్రజలను ఏకం చేసే అత్మీయత, విశ్వాసం, అనురాగాలకు ఈ పురస్కారం నిదర్శనం ప్రధాని మోడీ అన్నారు. ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (ఫస్ట్ క్లాస్) అవార్డు ప్రత్యేకంగా విదేశీ పౌరులకు ప్రదానం చేసే అత్యున్నత పౌర ,సైనిక పురస్కారం. ప్రధాని మోడీ  తన వారం రోజుల యూరప్ పర్యటనలో భాగంగా బ్రాటిస్లావాలో ఉన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu