Ad Code

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్‌లో ' సిరీస్' ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన మెటా !


మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రీల్స్‌లో " సిరీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మెటా అందుబాటులోకి తెచ్చిన కొత్త ఫీచర్ ద్వారా క్రియేటర్స్ ఎపిసోడ్ కంటెంట్ వలె మల్టిపుల్ రీల్స్‌తో సిరీస్‌లు చేసుకోవచ్చు. దీని ద్వారా క్రియేటర్ వారి రీల్ కంటెంట్‌ను ఒకే సిరీస్‌లోని వేర్వేరు ఎపిసోడ్స్‌ను ఆడియెన్స్‌కు అందించవచ్చు. మెటా అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొంత మంది క్రియేటర్స్‌కు అందుబాటులో ఉంది. టెస్టింగ్ దశలో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు టెక్ క్రంచ్ రిపోర్ట్ పేర్కొంది. టెక్ క్రంచ్ ప్రకారం, మెటా ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఎంపిక చేసిన క్రియేటర్స్‌కు టెస్ట్ చేస్తుంది. మెటా తీసుకువచ్చిన ఫీచర్ ఉద్దేశ్యం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను మార్చివేయడమేనని ఈ రిపోర్ట్ పేర్కొంది. రీల్స్ చూసే వారు కేవలం వీడియోలు స్క్రోల్ చేయడం మాత్రమే కాకుండా, ఒక సిరీస్‌లాగా లింక్ చేయబడిన వీడియోలను చూసే వీలు కల్పించనున్నారు. అయితే ఇదే తరహా ఫీచర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ 2023లో అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఒక క్రియేటర్‌కు సంబంధించిన వీడియోలను యూజర్స్‌కు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ ఫీచర్ సహాయం చేస్తుంది. ఒక క్రియేటర్ చేసిన వివిధ రీల్స్‌, వారి ప్రొఫైల్‌లోని ప్రత్యేక సిరీస్ పేజీలో కనిపిస్తాయి. ఒక క్రియేట్ ఏదైనా అంశంపై ఒక సిరీస్ వీడియోలు వరుసగా పదిరోజులు క్రియేట్ చేస్తే, ఆ పది వీడియోలు అన్ని ఒకే చోట కనిపిస్తాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం, ఇంతకు ముందు అప్‌లోడ్ చేసిన వీడియోలను కూడా సిరీస్‌లో కొత్త రీల్స్‌లో యాడ్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu