కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం కొత్తగా ఇండియా పోస్ట్ ప్రాంచైజ్ స్కీమ్ 2.0 ప్రవేశపెట్టింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించుకోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. పార్శిల్స్, కొరియళ్లు పికప్, డెలివరీ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ప్రజలకు పోస్టల్ సేవలను మరింత చేరువ చేసేందుకు, మరింత వేగంగా డెలివరీ చేసేందుకు ప్రాంఛైజీ పథకాన్ని పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. దేశంలో నివసించే ఎవరైనా ఈ ప్రాంఛైజీ తీసుకోవచ్చు. మీ ఏరియాల్లో పోస్టల్ సేవలు అందించి ఆదాయం పొందవచ్చు. స్పీడ్ పోస్ట్, పార్సిళ్లు బుకింగ్ చేయడంతో పాటు పార్సిళ్లు పికప్, డెలివరీ, క్లిక్ అండ్ బుక్, అంతర్జాతీయ ఈఎంఎస్ సేవలు వంటి అందించాల్సి ఉంటుంది. పికప్, డెలివరీ, బుకింగ్ వంటి సేవల్లో ఏదైనా ఎంచుకుని ప్రాంచైజీ తీసుకోవచ్చు. 18 ఏళ్ల నిండి ఉండాలి, బుకింగ్ సేవల కోసం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.డెలివరీ సేవల కోసం పదో తరగతి పాస్ అయి ఉండాలి .స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌పై అవగాహన కలిగి ఉండాలి. డెలివరీ సేవలు అందించాలంటే డ్రైవింగ్ లైసెన్స్, సొంత వెహికల్ ఉండాలి. పాన్ కార్డు కలిగి ఉండాలి. పోస్టల్ శాఖ ఉద్యోగులు ఈ ప్రాంచైజీ తీసుకునేందుకు అనర్హులు. డెలివరీ, పికప్ సేవలు అందించాలంటే రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేయాలి. బుకింగ్ సేవల కోసం రూ.10 వేలు జమ చేయాలి. అన్నీ సేవలు కావాలంటే రూ.15 వేలు డిపాజిట్ చేయాలి. మీరు చేసే ప్రతీ బుకింగ్, పికప్, డెలివరీపై కమిషన్ అందుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ సేవలకు అదనపు కమిషన్ ఉంటుంది. ఇండియన్ పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును పరిశీలించాక ఆమోదిస్తారు. మనీ డిపాజిట్ చేశాక మీరు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తి చేశాక పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుని పని మొదలుపెట్టవచ్చు.
0 Comments