Ad Code

ప్యాషన్‌ను ఫాలో అవ్వడమే నిజమైన సంతోషమని నిరూపించిన కుమార్ : అమెజాన్‌లో ఉద్యోగం మానేసి క్యాబ్ డ్రైవర్‌ గా మారిన వైనం

హైదరాబాద్‌కు చెందిన కుమార్ గతంలో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ అమెజాన్‌లో ఉద్యోగం చేసేవాడు. కానీ, డ్రైవింగ్ చేయడం అంటే అతనికి విపరీతమైన ఇష్టం. ఆ ప్యాషన్ కోసం ఏమాత్రం ఆలోచించకుండా 2014లోనే అమెజాన్‌లో తన జాబ్ మానేసి, పూర్తిస్థాయి క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. క్యాబ్ డ్రైవర్‌గా మారినప్పటి నుంచి ఇప్పటివరకు తను ఏకంగా 23,600 ట్రిప్పులు విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు కుమార్ చెబుతున్నాడు. ఒక కార్పొరేట్ ఆఫీసులో నాలుగు గోడల మధ్య కూర్చుని పనిచేయడం కంటే, ఇలా క్యాబ్ నడుపుతూ తన సొంత నగరమైన హైదరాబాద్‌ను రోజూ ఎక్స్‌ప్లోర్ చేయడం తనకెంతో ఇష్టమని కుమార్ చెబుతున్నాడు. అంతేకాకుండా, ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలవడం, వారితో మాట్లాడటం, వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవడం తనకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని ఆయన వివరించాడు. ఇటీవల కుమార్ క్యాబ్‌లో ప్రయాణించిన ఓ మహిళా టెకీ అతని మాటలకు, అతని ప్యాషన్‌కు ఎంతో ముచ్చటపడింది. మన దేశంలో బాధ్యతల కోసం ప్యాషన్‌ను వదులుకునే వారున్న ఈ రోజుల్లో ఇలా ప్యాషన్ కోసం జాబ్ వదిలేసి సంతోషంగా బతుకుతున్న ఇతని కథ ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu