Ad Code

ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లతో రాకెట్‌లా దూసుకెళ్లిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ వరసగా మూడో రోజు కూడా లాభాల బాట పట్టింది. గ్లోబల్ మార్కెట్లు డల్‌గా ఉన్నా ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లతో రాకెట్‌లా దూసుకెళ్లింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 544.15 పాయింట్లు (0.71%) ఎగబాకి.. 76,808.48 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 135.25 పాయింట్లు (0.57%) లాభపడి, 23,989.15 మార్కును దాటేసింది. మార్కెట్ ఊపందుకోవడానికి దేశంలోని కొన్ని దిగ్గజ కంపెనీలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్, అలాగే పవర్ సెక్టార్ దిగ్గజం ఎన్‌టీపీసీ షేర్లు ఏకంగా 2% చొప్పున లాభపడి మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఐటీ రంగం అత్యధికంగా లాభపడిన రంగంగా నిలిచింది. వీటితో పాటు మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా మార్కెట్‌కు మంచి బూస్ట్ ఇచ్చాయి. మెటల్స్, హెల్త్‌కేర్, సిమెంట్, ఫార్మా రంగాల్లో నేడు అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో నష్టాల్లో ముగిశాయి.

Post a Comment

0 Comments

Close Menu