శాంసంగ్ గెలాక్సీ ఎం 47 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కచ్చితమైన లాంచ్ డేట్ ని కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ జూలై ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, అమెజాన్ ప్రకటించిన బిగ్ సేల్ ప్రైమ్ డే 2026 సేల్ నెల ప్రారంభంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి, ఈ సేల్ కంటే ముందుగా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎం 47 ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ వెల్లడయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో మెరిసిపోతోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు రౌండ్ కార్నర్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా చేతిలో పట్టుకువడానికి అవసరమైన మంచి గ్రిప్ డిజైన్ తో అందిస్తుంది. ఈ అప్ కమింగ్ మంచి డ్యూరబిలిటీ కూడా కలిగి ఉంటుందని శాంసంగ్ తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 50MP నో షేక్ మెయిన్ కెమెరా ఉండొచ్చని కూడా ఊహించి చెబుతున్నారు. ఈ ఫోన్ కొత్త ఎం 4x సిరీస్ ఫోన్ లలో మరింత వేగవంతమైన చిప్ సెట్, బిగ్ బ్యాటరీ అండ్ పవర్ ఫుల్ ఛార్జ్ సపోర్ట్ తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉంటాయని శాంసంగ్ చెబుతోంది.
0 Comments