Ad Code

కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే : వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌

ర్ణాటక కాంగ్రెస్ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు మద్దతుగా కార్యకర్తలు పైకి లేచి 'డీకే-డీకే' అని నినాదాలు చేశారు. మల్లికార్జున్‌ ఖర్గే దీనిపై తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇది పార్టీ కార్యక్రమం అని, ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని వారికి గుర్తు చేశారు. 'నోరు మూసుకొని కూర్చోండి. దేశమంతా మీ చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. పనికిమాలిన వాళ్లు' అని ఆయన మండిపడ్డారు. 'గుర్తుంచుకోండి, పార్టీకి క్రమశిక్షణ ఎప్పుడూ అవసరం. ఇక్కడ ఎవరైతే అరుస్తున్నారో, వారి దృశ్యాలు రికార్డవుతాయి. వాటిని పరిశీలించిన తర్వాత నేను క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా' అని అన్నారు. మరోవైపు ఖర్గే వ్యాఖ్యల నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం డీకే శివకుమార్‌ పార్టీ కార్యకర్తలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఆయన పైకి లేచి నిశ్శబ్దంగా కూర్చోవాలని కార్యకర్తలకు సైగ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu