దేశీయ మార్కెట్లో జూన్ 10న రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ఫ్లిప్ కార్ట్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది.. రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ MIl STD 810H మిలటరీ గ్రీడ్ డ్యూరాబిలిటీ డిజైన్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో రియల్ గేమింగ్ కోసం తగిన డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ ను డ్యూయల్ చిప్ సెట్ పవర్ తో లాంచ్ చేస్తుంది. ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో జతగా Hyper Vision+ AI చిప్ తో కూడా ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ లో 14GB డైనమిక్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ వేడెక్కకుండా చూసుకునే పెద్ద ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్ వేర్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లో AI సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది AI పోర్ట్రైట్ గ్లో, AI ఎరేజర్ మరియు మరిన్ని లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో రియర్ కెమెరాతో జతగా సరికొత్త AI పల్స్ లైట్ కూడా అందించింది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 8000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ బ్యాటరీ 4 లేయర్ సేఫ్టీ ఫీచర్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ బ్యాటరీ 7 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో 45W ఫాస్ట్ ఛార్జ్, బైపాస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 27W వరకు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ఉన్నాయి.
0 Comments