కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలో రవాణా రంగం ఆధునీకరణ, వాయు కాలుష్య నివారణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏకంగా రూ. 39,290 కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పశ్చిమాసియా యుద్ధం, పాక్ గగనతల మూసివేత కారణంగా దేశీయ విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ సరికొత్త వ్యూహాత్మక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ధరల భారం నుంచి విమానయాన సంస్థలను కాపాడేందుకు చమురు సంస్థలకు 10 వేల కోట్లను వడ్డీ లేని ఆర్థిక సాయంగా ప్రకటించింది. దీనివల్ల ఇంధన ధరలు పెరిగినా, విమాన టికెట్ల ధరలు అకస్మాత్తుగా పెరగకుండా ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది.
0 Comments