Ad Code

ఫోర్స్‌ సరికొత్త 'ట్రావెలర్‌ ఎన్‌' సిరీస్‌ : మే రెండోవారం నుంచి బుకింగ్‌లు ప్రారంభం


దేశంలో అతిపెద్ద వ్యాన్‌ తయారీ సంస్థ ఫోర్స్‌ మోటార్స్, తన ఐకానిక్‌ ట్రావెలర్‌ ప్లాట్‌ఫారమ్‌ను మరింత మెరుగుపరుస్తూ కొత్త 'ఫోర్స్‌ ట్రావెలర్‌ ఎన్‌' సిరీస్‌ని ఆవిష్కరించింది. అంబులెన్స్‌లు, స్కూల్‌ బస్సులు, డెలివరీ వాహనాల కోసం రూపొందించిన ఈ కొత్త శ్రేణితో 'షేర్డ్‌ ప్యాసింజర్‌' మొబిలిటీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త 'ట్రావెలర్‌ ఎన్‌'లో డిజిటల్‌ క్లస్టర్, 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, మెరుగైన ఎన్‌వీహెచ్‌ (నాయిస్, వైబ్రేషన్, హార్‌‡్షనెస్‌) టెక్నాలజీ, అధునాతన హెచ్‌వీఏసీ సిస్టమ్, ఎర్గోనామిక్‌ సీట్లు వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచి్చంది. అలాగే రోబోటిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేటెడ్‌ డోర్‌ హెమ్మింగ్‌ టెక్నాలజీ ద్వారా బిల్డ్‌ క్వాలిటీ, స్ట్రక్చరల్‌ ఇంటిగ్రిటీని పెంచింది. ఈ వాహనాల్లో బీఎస్‌-4 స్టేజ్‌2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణమైన ఎఫ్‌ఎం 2.6 సీఆర్‌ ఇంజిన్‌ను అమర్చారు. వాహన యజమానుల కోసం 'ఫోర్స్‌ కేర్‌' కింద పొడిగించిన వారంటీ, 'ఐ-పల్స్‌' ద్వారా రియల్‌-టైమ్‌ వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి సేవలను సంస్థ అందిస్తోంది. మే రెండోవారం నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu