బెంగళూరు నగరంలో నివసించే బ్యూటీషియన్‌కు మోహన్ కుమార్ అనే జ్యోతిష్యుడు పరిచయమయ్యాడు. ఆర్థిక కష్టాలు తొలగిస్తానని, ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలని ఆమెను నమ్మించాడు. ఈ క్రమంలో జనవరి 30న ఆ మహిళపై మొదటిసారి బలవంతంగా దాడి చేశాడు. భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు ఫిబ్రవరి 10న నేరుగా మహిళ ఇంటికే వెళ్ళాడు. ఇంట్లో ఉన్న భర్త, కుమారుడిని బయటకు పంపి ఆమెపై మళ్ళీ అఘాయిత్యం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే భర్త, కొడుకు చనిపోతారని బెదిరించాడు. ఆ భయంతోనే బాధితురాలు కొన్ని రోజులు మౌనంగా ఉన్నా, చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మోహన్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ జ్యోతిష్యుడు పరారీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మహిళలు మోసపోవద్దని, ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
0 Comments