Ad Code

ఓడినా ఓటేసిన జనాన్ని కలిసేందుకు కొలత్తూర్ వెళ్లిన స్టాలిన్ : కన్నీరు పెట్టిన డీఎంకే కార్యకర్తలు


మిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఓడినా తమకు ఓటేసిన జనాన్ని కలిసేందుకు 24 గంటల్లోనే నియోజకవర్గాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు గెలిచిన ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చిన స్టాలిన్  తాను ఓడిన కొలత్తూర్ నియోజకవర్గానికి వెళ్లారు. వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన కొలత్తూర్ లో ఈసారి టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలైనా స్టాలిన్.. తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కొలత్తూరు పర్యటనలో స్టాలిన్ ను చూసి డీఎంకే కార్యకర్తలు కన్నీరు మున్నీరయ్యారు. స్టాలిన్ ఓటమి జీర్ణించుకోలేక మహిళలు ఏడ్చేశారు. ఈ ఫొటోల్ని స్టాలిన్ స్వయంగా ట్వీట్ చేశారు. తనకూ, కొలత్తూరుకు మధ్య ఉన్న బంధం ఎన్నికల గెలుపు ఓటములకు అతీతమైనదని ఆయన తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తనకు మద్దతు ఇస్తున్నది కొలత్తూరు నియోజకవర్గ ప్రజలేనన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 5 సంవత్సరాలు అధికార పక్షంలో తాను కొలత్తూరుకు సాధ్యమైన అన్ని పథకాలను తీసుకువచ్చి అమలు చేశానని గుర్తుచేసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu