ఆంధ్రప్రదేశ్ లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించిన విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ పోలీసులు కాకినాడ కు తరలించారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ లో అనంతబాబును విచారించనున్నారు.
0 Comments