Ad Code

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరిక : వాహన విండ్‌స్క్రీన్‌పై అతికించడం తప్పనిసరి


నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరిగా వాహనం ముందు విండ్‌స్క్రీన్‌పై అతికించాలి. కానీ కొందరు వాహనదారులు దాన్ని చేతిలో పట్టుకొని స్కాన్ చేయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఎన్‌హెచ్‌ఏఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది. విండ్‌స్క్రీన్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌ను అమర్చడం వల్ల టోల్ గేట్ల వద్ద సులభంగా స్కాన్ అవుతుంది. వాహనాలు ఆగకుండా ముందుకు సాగుతాయి. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ను పలు వాహనాల్లో ఉపయోగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ను సరిగ్గా అమర్చకపోతే దానిని బ్లాక్ చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్‌లు, అనధికారిక లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ పాస్‌లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్‌లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్‌ఫామ్‌లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్‌లను నమ్మకూడదని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu