రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ఎమ్మెల్సీ అనంతబాబు తరలింపు


ఆంధ్రప్రదేశ్ లో దళిత యువకుడు, కారు డ్రైవర్ హత్యకేసులో నిందితుడు, ఎమ్మెల్సీ అనంత బాబు పోలీసు కస్టడీ ముగిసింది. కారు డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్యకేసు ప్రలోభ పెట్టిన కేసులో ఒక్కరోజు పోలీస్ కస్టడీ నుండి ఎమ్మెల్సీ అనంతబాబును సర్పవరం పోలీసులు వైద్య పరీక్షలకు నిమిత్తం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. పోలీస్ కస్టడీలో పోలీసులు ఎన్నిసార్లు అడిగినా తనకేమీ తెలియదంటూ సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. సుమారు 50 ప్రశ్నలు పోలీసులు అడిగినా నాకు తెలియదు, గుర్తు లేదు అని అనంతబాబు పోలీసు విచారణలో సమాధానం ఇచ్చారు. దీంతో మరోమారు పోలీసు కస్టడీకి కోరాలని బావిస్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయం ముగియడంతో వైద్య పరీక్షలు అనంతరం కాకినాడ మొబైల్ కోర్టులో హాజరుపర్చి అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కి ఎమ్మెల్సీ అనంతబాబును తరలించారు. రాత్రి 11 గంటల. వరకు కొనసాగిన విచారణలో కేసు దర్యాప్తు అధికారి తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తో పాటు ఇద్దరు సిఐలు ఇతర పోలీసు సిబ్బంది విచారణలో పాల్గొన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org