Ad Code

ఇన్‌స్టాగ్రామ్ లో తోటి విద్యార్థి వేధింపుల కారణంగా విద్యార్థిని ఆత్మహత్య !


హైదరాబాద్‌ శివారు కుంట్లూరులో పదో తరగతి విద్యార్థినిని  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తోటి విద్యార్థి చేసిన లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుంట్లూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సదరు బాలికకు, అదే స్కూల్‌కు చెందిన ఓ బాలుడితో స్నేహం ఏర్పడింది. అయితే, ఆ బాలుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆమె పలుమార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. బాలుడి వేధింపులు మితిమీరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని, గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విద్యార్థుల భద్రత, సామాజిక మాధ్యమాల్లో వేధింపులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పిల్లల సోషల్ మీడియా వినియోగం పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu