Ad Code

తేజస్వి సూర్య తెలివి లేని వెధవ : బీజేపీ ఎంపీపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం


ర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో తెలివి లేని ఒక వెధవ (తేజస్వి సూర్య) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చాడు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆత్మను క్షోభ పెట్టడమేనని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఆమోదం పొందిన బిల్లులను, రాజ్యాంగ ప్రక్రియను అవమానించడం అత్యంత దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి ఎంపికైన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు చీము, నెత్తురు లేకుండా ఆ మాటలను విని ఎంజాయ్ చేస్తున్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణను అవమానపరుస్తుంటే మీకు నోరు రావడం లేదా?" అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు నిజంగా తెలంగాణ బిడ్డలు అయితే, వెంటనే తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మీరు తెలంగాణ తల్లికి ద్రోహం చేసినట్లేనని హెచ్చరించారు. కేవలం బీజేపీ మాత్రమే కాకుండా, ఇటీవల ఒక టీడీపీ ఎంపీ కూడా విభజనపై అనుచితంగా మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు. "బిడ్డా జాగ్రత్త.. తెలంగాణ విషయంలో పిచ్చిమాటలు మాట్లాడితే సహించేది లేదు" అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ఏర్పాటు అనేది దశాబ్దాల పోరాటం మరియు ప్రజల ఆకాంక్ష, దానిని ఒక దేశ విభజనతో పోల్చి చిన్నచూపు చూడటం బీజేపీ అహంకారానికి నిదర్శనమని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం మరియు ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu