Ad Code

వాట్సప్ లో నంబర్ లేకుండానే చాటింగ్ : యూజర్‌నేమ్ కొత్త ఫీచర్


వాట్సప్ వినియోగదారులు మీ ఫోన్ నంబర్ తెలియకుండానే ఇతరులతో సందేశాలు పంపడం లేదా కాల్స్ మాట్లాడటం సాధ్యమవుతుంది. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ వాట్సప్ ఈ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను అధికారికంగా విడుదల చేసింది. సాధారణంగా వాట్సప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా మీకంటూ ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అవతలి వారికి మీ యూజర్‌నేమ్ చెబితే సరిపోతుంది, మీ ఫోన్ నంబర్ వారికి కనిపించదు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి రాగా, దశలవారీగా అందరికీ అందుబాటులోకి రానుంది. వాట్సప్ యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది: యూజర్‌నేమ్ కనీసం 3 నుండి గరిష్టంగా 35 అక్షరాల వరకు ఉండాలి. అక్షరాలు (A-Z), అంకెలు (0-9), డాట్ (.), మరియు అండర్‌స్కోర్ (_) మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో వాడుతున్న యూజర్‌నేమ్‌నే వాట్సప్‌లో కూడా వాడాలనుకుంటే, ఖాతాలను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu