Ad Code

అపరిశుభ్ర వాతావరణంలో, హానికరమైన రసాయనాలతో తినుబండారాలు తయారీ కేంద్రంపై పోలీసులు దాడి


తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ఓ కంపెనీలో 'కరాచీ పోలో' , 'రింగ్ లైట్' పేర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా స్నాక్స్‌ను తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో, హానికరమైన రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో H-Fast బృందం సోదాలు చేపట్టింది.ఈ తయారీ కేంద్రంలో కనీస శుభ్రత పాటించకపోవడమే కాకుండా, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వీటిని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్నాక్స్ తయారీలో తక్కువ ధరకే లభించే నాసిరకం నూనెలు, విషతుల్యమైన రంగులు వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అధికారులు దాడి చేసిన సమయంలో అక్కడ నిల్వ ఉన్న భారీ ఎత్తున స్టోర్ చేసిన స్నాక్స్‌, యంత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపి నిర్వాహకులను అదుపులోకి తీసకుని విచారిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాలే ధ్యేయంగా పనిచేస్తున్న ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

Post a Comment

0 Comments

Close Menu