Ad Code

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు : నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు


ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో బిగ్ షాక్ తగిలింది. రెగ్యులర్ బెయిల్ కోసం ఈ కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప పిటిషన్ల దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లపై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో కొందరికి రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప సైతం రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu