ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ఖాజీపేటలో బాలిక హత్యకేసు నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. వెంకటేష్ అనే యువకుడు బాలిక ఇంటికి వెళ్లాడు.. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తిత గొంతుకోసి పారిపోయాడు. బాధితురాలిని కడప రిమ్స్‌కు తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందింది. పోలీసులు నిందితుడు వెంటేషన్‌ను అరెస్ట్ చేయగా ఉదయం పారిపోయే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున అతడిని మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా, తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచాడు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముందుగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు ఆగకపోవడంతో చివరకు అతని కాళ్లపై కాల్పులు జరిపారు. గాయపడిన వెంకటేష్‌ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments