బెంగళూరు శివారు, బైదరహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజనానగర్‌లో ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ యువతి అతడి నమ్మించి హత్య చేసింది. ప్రియుడు కిరణ్ కళ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టేసి కిరోసిన్ పోసి ప్రియురాలు ప్రేమ సజీవదహనం చేసింది. పథకం ప్రకారమే యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఏం జరిగింది అని అడగ్గా తాను బాత్‌రూమ్‌లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చే సరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పథకం ప్రకారం ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
0 Comments