Ad Code

భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు : మీడియా చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి


తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ త్వరలోనే భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ల్యాండ్ వ్యాల్యూ పెంపు జరగలేదని, త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను 'భూ-భారతి' ద్వారా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. భూముల రిజిస్ట్రేషన్‌ను మ్యాప్‌తో అనుసంధానం చేస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త విధానం ప్రారంభమవుతుందని చెప్పారు. మ్యాప్‌తో కూడిన తొలి రిజిస్ట్రేషన్ పాలేరు ప్రాంతంలో ప్రారంభం కానుందని తెలిపారు. రెవెన్యూ శాఖలో కొత్త పాలసీ తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని, త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. అలాగే కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతోందని, అది విడతల వారీగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే చేపడతామని పేర్కొన్నారు. సమ్మర్ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు. అసైన్డ్ భూములపై వచ్చిన ఫిర్యాదులను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే నాలుగు రకాల ఫిర్యాదులను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని, శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమని మంత్రి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తనపై ప్రతిపక్షం విమర్శలు చేసినప్పుడు ఇతర మంత్రులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. ప్రతిపక్షం ట్రాప్‌లో పడకుండా ఓపికగా సమాధానాలు ఇచ్చానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై లిస్ట్ తయారు అవుతోందని, సరైన సమయంలో అన్ని విషయాలు బయటకు వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu