బెంగళూరు లోని విజయపురలో హనుమ జయంతి సందర్భంగా బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ మాట్లాడుతూ ముస్లింలను తొలగించిన మైనార్టీ స్థానంలో మరాఠీలు, బ్రాహ్మణులు, క్షత్రియలను చేరుస్తానన్నారు. 'నేను ముఖ్యమంత్రిని అయితే వెంటనే ముస్లింలను మైనారిటీ జాబితా నుంచి తొలగిస్తానన్నారు. రాష్ట్రంలోని తండ్రీ కొడుకులు యడియూరప్ప, విజయేంద్రలను పార్టీ నుంచి దూరం చేసి మళ్లీ తనను ఆహ్వానిస్తారన్నారు. ఆ తర్వాత సీఎం అవుతానని అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తరహాలోనే పాలన తీసుకువస్తానన్నారు. బాగల్‌కోటె బీజేపీ అభ్యర్థి వీరణ్ణ చిరంతిమఠ తనకు ఎంతోకాలంగా ఆత్మీయులని, అందుకే ఆయన తరపున ప్రచారం చేస్తానన్నారు.
0 Comments