Ad Code

సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరిన తొలి భారతీయ మహిళ దివ్య సింగ్ !


త్తరప్రదేశ్‌కు చెందిన దివ్య సింగ్, నేపాల్ రాజధాని ఖాట్మండ్ నుండి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు సైకిల్‌పై ప్రయాణించింది. కేవలం 14 రోజుల్లో ఆమె ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు. గడ్డకట్టే చలి, నిటారుగా ఉండే భూభాగం, తక్కువ ఆక్సిజన్ స్థాయిలను ఎదుర్కొంటూ, ఆమె ప్రతిరోజూ గంటల తరబడి సైకిల్ తొక్కారు. సాధారణంగా ట్రెక్కింగ్ చేసేవారికే సవాలుగా నిలిచే ఈ మార్గంలో, సైకిల్‌ను తొక్కుతూ.. వీలుకాని చోట భుజాన మోస్తూ ఆమె సాగించిన ప్రయాణం భారతీయ మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రయాణం దివ్య సింగ్ కి అంత సాఫీగా ఏమీ సాగలేదు. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడి దారులు మూసుకుపోయిన మార్గాల్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన సైకిల్‌ను భుజాన వేసుకుని నడుస్తూ ముందుకు సాగింది. అతా అకుంఠిత దీక్ష, అంకితభావంతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకోవడమే చాలా మంది సాహస యాత్రికులకు ఒక సవాలుతో కూడిన యాత్ర. అలాంటిది సైకిల్‌పై ఆ మార్గాన్ని అధిగమించిన దివ్య సింగ్ ప్రతిభను చూసి నెటిజన్లు, సాహస క్రీడాకారులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 



Post a Comment

0 Comments

Close Menu