Ad Code

బజాజ్ డొమినార్ 349cc విడుదల


349cc ఇంజన్‌తో బజాజ్ డొమినార్ 400 విడుదలైంది. ఇది 349.13cc ఇంజన్‌తో వస్తోంది. కానీ బైక్ పేరు మాత్రం డొమినార్ 400గానే కొనసాగుతోంది. ఇది పన్ను లాభం కోసం చేసిన మార్పు (350cc క్రింద ఉండటం వల్ల 18% GST మాత్రమే వర్తిస్తుంది, ఇంతకు ముందు 373cc ఇంజన్‌తో 40% GST ఉండేది). బజాజ్ ఇటీవల NS400Zని కూడా 350ccకి మార్చింది. లక్ష్యం.. పన్ను భారం తగ్గించి ధర తగ్గించి మార్కెట్‌లో మరింత ఆకర్షణీయంగా చేయడం. పవర్ దాదాపు అదే ఉండటం వల్ల టూరింగ్ బైక్‌గా ఆకర్షణ తగ్గదు. ఈ మోటార్‌సైకిల్‌ను కొత్త 350cc ఇంజన్‌తో విడుదల చేశారు. ఇందులో ఇప్పుడు 349.13cc ఇంజన్ ఉంది, ఇది 40.4 bhp పవర్, 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు. గతంలో, ఈ మోటార్‌సైకిల్‌ను 373cc ఇంజన్‌తో అందించేవారు. ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్ఈడీ లైట్లు, ట్విన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్లిప్పర్ క్లచ్, యూఎస్‌డీ ఫోర్కులు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రెండు చక్రాలపైనా డిస్క్ బ్రేకులు, స్ప్లిట్ సీటు, 13-లీటర్ల పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం వంటివి అమర్చబడి ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu