Ad Code

అమెరికా, చైనా దేశాల 20 మంది రక్షణ రంగ శాస్త్రవేత్తల మృతి, అదృశ్యం ?


మెరికా, చైనాలలో కీలకమైన రక్షణ రంగ శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో వరసగా మరణించడం లేదా అదృశ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ మరణాల వెనుక కుట్ర కోణం ఉన్నట్లు ఇప్పటి వరకు ఆధారాలు లేకపోయినప్పటికీ, వారు పనిచేస్తున్న రంగాల ప్రాముఖ్యత, ఈ ఘటనలు జరిగిన సమయాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. అమెరికాలో 11 మంది అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తలు రహస్య మరణాలకు లేదా అదృశ్యాలకు గురికాగా, అదే తరహాలో అంతరిక్ష, రక్షణ, అణు సాంకేతిక రంగాలలో పనిచేస్తున్న కనీసం తొమ్మిది మంది చైనా శాస్త్రవేత్తలు కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైపర్‌సోనిక్ ఆయుధాలు, సైనిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ డిఫెన్స్ వంటి అత్యంత సున్నితమైన రంగాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఇలా అనుకోకుండా మరణించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య వ్యూహాత్మక పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. చైనా లేదా అమెరికా శాస్త్రవేత్తలను ఎవరైనా శత్రువులు లక్ష్యంగా చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu