ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ దగ్గర బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బొలెరోలో 20 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. బొలేరో వాహనం నర్సాపురం నుంచి సత్తెనపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
0 Comments