Ad Code

మండల పరిషత్ ఆదర్శ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్‌


ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం, తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ పాఠశాలను మంత్రి నారా లోకేశ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఈ పాఠశాలలో భోజనం సరిగా లేదంటూ విద్యార్థులతో డ్రామా ఆడించి, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన హెచ్‌ఎం జాన్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ పాఠశాలకు చేరుకుని క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి అసలు విషయాలను తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా, మీడియాను లోపలికి అనుమతించకుండా అత్యంత గోప్యంగా ఈ తనిఖీ నిర్వహించారు. కుట్రపూరిత ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని లోకేష్ తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu