దేశంలో అత్యంత విజయవంతమైన, అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. 2008లో మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి డిజైర్ ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను నమోదు చేస్తుంది. ఒక్క 2025లోనే ఇది 2.14 లక్షల సేల్స్ సాధించి అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. మారుతి డిజైర్ కారు ప్రారంభ ధర రూ. 6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ & సీఎన్జీ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. మంచి మైలేజ్ కోసం ఇప్పుడు కూడా ఎక్కువమంది ఈ కారునే కొనుగోలు చేస్తున్నారు.
0 Comments