Ad Code

సన్‌రైజర్స్ హైదరాబాద్ లో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ : కావ్యా మారన్ పై తీవ్ర విమర్శలు


పీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పాకిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్  అబ్రార్ అహ్మద్ తో 2.34 కోట్ల రూపాయలవిలువైన కాంట్రాక్ట్ ను కుదుర్చుకుంది. కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ యాజమాన్యం పాకిస్తాన్ క్రికెటర్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ స్వయంగా అతన్ని జట్టులోకి తీసుకుంది. అతని ట్రాక్ రికార్డును ఆధారంగా చేసుకుని, భారీ మొత్తాన్ని వెచ్చించడానికీ వెనుకాడలేదు. ఈ కాంట్రాక్ట్ ప్రకారం- అబ్రార్ అహ్మద్ సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున ఆడాల్సి ఉంటుంది. ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ కోసం అతన్ని జట్టులో వినియోగించుకుంటుంది. నిజానికి పాకిస్తాన్ ఆటగాళ్లను ఎవరినీ కూడా ఐపీఎల్ టోర్నమెంట్ కోసం తీసుకోకూడదు. ఈ నిబంధన హండ్రెడ్ లీగ్స్ కు వర్తించదు. అందుకే కావ్యా మారన్ ఎటువంటి భేషజాలకూ పోకుండా అబ్రార్ అహ్మద్ ను జట్టులోకి తీసుకుంది. ప్రపంచ టీ20 లీగ్‌లలో పాక్ ఆటగాళ్లను తీసుకోకూడనే సంప్రదాయానికి ఆమె తెరదించారు. ఈ పరిణామాలు ఆమెపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. తీవ్రంగా ట్రోలింగ్ ను ఎదుర్కొంటోన్నారు. సన్‌రైజర్స్ బ్రాండ్‌ను బహిష్కరించాలని పలువురు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆటగాడికి భారీ కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా ఫ్రాంచైజీ యజమానులు జాతీయ భావాలను విస్మరించి స్వలాభం కోసం పనిచేశారని విమర్శకులు ఆరోపించారు. ఈ వేలంలో అబ్రార్‌ కోసం దూకుడుగా బిడ్డింగ్ చేసినందుకు పలువురు తప్పుబట్టారు. 'ది హండ్రెడ్‌'లో భారత్ కు చెందిన నాలుగు ఫ్రాంఛైజీలు- సన్‌రైజర్స్ లీడ్స్, ఎంఐ లండన్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సదరన్ బ్రేవ్.. పాకిస్తానీ ఆటగాళ్ళను తీసుకోవడానికి ఇష్టపడవు అనే ఊహాగానాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. ఐపీఎల్ యజమానులకు చెందిన జట్లు దక్షిణాఫ్రికా ఎస్ఏ20, యూఏఈ ఐఎల్ టీ20 వంటి లీగ్‌లలో ఏ పాకిస్తానీ క్రికెటర్‌నూ తీసుకోలేదు. హండ్రెడ్స్ లీగ్ వేలం తొలి రౌండ్‌లో హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, సయిమ్ అయూబ్ వంటి ప్రముఖ పాక్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు.

Post a Comment

0 Comments

Close Menu