వైఎస్సార్సీపీ హయాంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత అధికారం కోల్పోయాక రాజకీయాలకు, ఎంపీ పదవికీ గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన్న విషయం తెలిసిందే.కానీ కొంతకాలం తర్వాత తిరిగి ఏపీ మద్యం స్కాంపై సీఐడీ దర్యాప్తు చేస్తుంటే తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ తర్వాత సీఐడీ తనను కూడా నిందితుడిగా చేర్చడంతో తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ రూటు మార్చారు. నెల్లూరులోని శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం లో భాగంగా అగ్నాస్త్రం మిరప చెట్లకు స్ప్రే చేస్తున్నామని సాయిరెడ్డి ఇవాల ట్వీట్ చేశారు. అగ్నాస్త్రం తయారీకి గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టి, మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆపై చెట్లకు స్ప్రే చేస్తామని సాయిరెడ్డి ఇందులో వివరించారు. అలా స్ప్రే చేస్తున్న వీడియోను కూడా ఇందులో షేర్ చేశారు.
0 Comments