ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, పిచ్చుకల పాలెం వద్ద జుడీషీయల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంఖుస్థాపన చేశారు. ఈ జుడీషీయల్ అకాడమీని 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బిలో జి ప్లస్ 3 అంతస్తులతో అకాడమిక్ బ్లాక్ నిర్మిస్తున్నారు. అదే విధంగా జి ప్లస్ 8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్,జి ప్లస్ 3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్, గెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు.120 మంది బ్యాచ్ ఆఫ్ ట్రైనీ జడ్జిలకు సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మొత్తం భవన విస్తీర్ణం 2.05 లక్షల చదరపు అడుగులు. ఏపీ హైకోర్టు నుండి ఈజుడీషియల్ అకాడమి 5.7 కి.మీల దూరంలో 50 మీటర్ల వెడల్పు కలిగిన మంచి రహదారి సౌకర్యం కలిగి ఉంది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెకె మహేశ్వరి,జస్టిస్ పిఎస్ నర్సింహ,జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,జస్టిస్ ఎస్విఎన్ భట్టి,జస్టిస్ జోయ మాల్య బాగ్చి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, జిఏడి ముఖ్య కార్యదర్శి శ్యామల రావు,ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్,గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా ఇతర అధికారులు, పలువురు జుడీషియల్ అధికారులు పాల్గొన్నారు.
0 Comments