Ad Code

పెరిగిన కోడి మాంసం ధరలు


కోడి మాంసం ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగి కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 280 నుండి రూ. 300 వరకు పలుకుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా కిలో ధర రూ. 300 మార్కును తాకగా, విజయవాడలో రూ. 270 మరియు గుంటూరు ప్రాంతంలో సుమారు రూ. 250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడానికి ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల మరణాల శాతం అధికమై సప్లై తగ్గడం ఒక ప్రధాన కారణం. పౌల్ట్రీ ఫామ్‌ల నిర్వహణ ఖర్చులతో పాటు దాణా ధరలు కూడా పెరగడం ఈ ధరల పెరుగుదలకు దారితీసింది. 

Post a Comment

0 Comments

Close Menu