అసోం లోని కామాఖ్య నుంచి తెలంగాణ లోని చర్లపల్లి ప్రాంతాల మధ్య అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. అతి తక్కువ చార్జీతో ఈ రైలులో సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ రైలు మార్గమధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్‌లలో ఆగి వెళుతుంది.
0 Comments