Ad Code

మారుతారా? లేక చర్యలు తీసుకోవాలా? : ప్రజాప్రతినిధులకు పవన్ కల్యాణ్ హెచ్చరిక


విజయవాడలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ ప్రజాప్రతినిధులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు నేతల తీరు వల్ల పార్టీ గౌరవం మంటగలుస్తోందని, అవినీతి ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించే వరకు పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారని సూటిగా నిలదీశారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను ఆసరాగా చేసుకుని, యాజమాన్యాలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడుతుంటే, మీరు ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటి? మిమ్మల్ని నమ్మి టికెట్లు ఇచ్చింది వసూళ్లు చేయడానికా?" అంటూ పవన్ నిప్పులు చెరిగారు. ఇండస్ట్రీల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ ఇలాంటి చర్యలు పార్టీ పరువు తీయడమేన్నారు. ఎంత చెప్పినా కొందరిలో మార్పు రాకపోవడంపై పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్న తరుణంలో, సొంత పార్టీ నేతలే వివాదాలకు కేంద్రబిందువు కావడం పవన్‌ను ఇబ్బందికి గురి చేస్తోంది. "మారతారా? లేక చర్యలు తీసుకోవాలా?" అనే రీతిలో పవన్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు జనసేన క్యాడర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Post a Comment

0 Comments

Close Menu