గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడకుండా ఉండేందుకు విద్యుత్ పై రాయితీని ప్రకటించిన సీఎం స్టాలిన్

Telugu Lo Computer
0


మిళనాడులో ఏర్పడిన వాణిజ్య గ్యాస్ కొరతపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శనివారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోటళ్లు, చిన్న తరహా పరిశ్రమలు, ఇతర ఆహార తయారీ కేంద్రాలు గ్యాస్ కొరత వల్ల మూతపడకుండా చూసేందుకు విద్యుత్ పై రాయితీని ప్రకటించిది. వంటగ్యాస్ కొరత కారణంగా ఎల్‌పీజీ స్టౌవ్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లనువాడే హోటళ్లు, టీ షాపులు, క్లౌడ్ కిచెన్‌లు, ఆహార తయారీ యూనిట్లకు అదనపు విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూ.2 చొప్పున రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ వినియోగంపై విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నంత వరకు ఈ రాయితీ కొనసాగుతుందని తెలిపింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default