తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి హరితా రిసార్ట్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ క్లాస్ చెప్పారు. జియు జిట్సు అనే మార్షల్ ఆర్ట్‌లో మెళకువలను డీసీసీ అధ్యక్షులకు వివరించారు. మార్షల్ ఆర్ట్స్‌ను వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఐడియాలజీపై క్లాస్ చెప్పారు. నాయకులు తమ అహంకారాన్ని పక్కన పెట్టి పని చేయాలని రాహుల్ సూచించారు. ఈగోల కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు.. మరో పదిమందిని తయారు చేయాలని, పని చేస్తున్న వారిని గుర్తించాలని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐసీసీ అగ్రనేత వివరించారు.పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తోందని, ఇరాన్ వెనక చైనా, రష్యా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోడీ పూర్తిగా సరెండర్ అయ్యారని.. ట్రంప్‌కు వ్యతిరేకంగా మోదీ పని చేయలేరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
0 Comments