Ad Code

పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం


ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు 3,415 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించబోతున్నారు. ఈ మేరకు విద్యార్ధులు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని ఆర్టీసీ తెలిపింది. పదో తరగతి విద్యార్ధులు ఇలా పరీక్షలకు వెళ్లేందుకు చేసే ఉచిత ప్రయాణానికి మూడు రకాల బస్సుల్ని అనుమతిస్తున్నారు. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి వెళ్లేందుకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ ఆదేశాలు ఇచ్చింది. 

Post a Comment

0 Comments

Close Menu