Ad Code

షియోమీ ప్యాడ్ 8 విడుదల


దేశీయ మార్కెట్లో షియోమీ ప్యాడ్ 8ను విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్ సేల్‌ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. తొలిసేల్‌లో భాగంగా సూపర్‌ ఆఫర్లను ప్రకటించింది. మార్చి 31 వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్లు అమల్లో ఉంటాయి. దీంతోపాటు బ్యాటరీ మినహా ట్యాబ్లెట్‌పై సంవత్సరం వరకు వారంటీని పొందవచ్చు. షియోమీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌, షియోమీ రిటైల్‌, భాగస్వామ్య స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్‌ 11 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 4 చిప్‌ను కలిగి ఉంది. మిడ్‌ రేంజ్‌ ధరలో ఈ ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్‌ 11.2 అంగుళాల 3.2k డిస్‌ప్లేతో విడుదల అయింది. 144Hz రీఫ్రెష్ రేట్‌, 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 345ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. డాల్బీ విజన్, HDR10, DCI-P3 కలర్ గామట్‌ను సపోర్టు చేస్తుంది. గ్లాసీ డిస్‌ప్లే లేదా నానో టెక్చర్ వెర్షన్లు అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌ గ్రాఫైట్‌ గ్రే, టైటానియం బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ షియోమీ ప్యాడ్‌ 4nm స్నాప్‌డ్రాగన్8s జెన్‌ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Adreno 825 GPU ను కూడా కలిగి ఉంది. 8GB LPDDR5x ర్యామ్ లేదా 12GB LPDDR5T ర్యామ్‌, 256GB UFS 4.1 స్టోరేజిని సపోర్టు చేస్తుంది. షియోమీ HyperOS 3 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరాను కలిగి ఉంది. 30fps తో 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 30fps తో 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ అనేక AI ఫీచర్లను కలిగి ఉంది. AI రైటింగ్‌ అసిస్టెంట్‌, AI క్రియేషన్ టూల్స్ ను కలిగి ఉంది. 45W టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 9200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా వైఫై 7, వైఫై 6E, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్‌, గైరోస్కో్ప్‌, ప్రాక్సిమిటీ సెన్సర్, మాగ్నిటిక్‌ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్ ఉంది. డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో క్వాడ్ స్పీకర్‌లు ఉన్నాయి. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.36999, 12GB/256GB స్టోరేజీ నానో టెక్చర్‌ డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.38999 గా ఉంది. షియోమీ క్రియేటర్‌ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ.41999 గా ఉంది. అదే నానో టెక్చర్‌ డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.43999 గా ఉంది. SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu