Ad Code

హైదరాబాద్ ఏసీ బస్సుల్లో 20-30 శాతం రాయితీ


హైదరాబాద్ లోని ఏసీ బస్సుల్లో 20-30 శాతం రాయితీ ఇవ్వడానికి గ్రేటర్‌ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలలు టికెట్‌ చార్జీలపై రాయితీని అందిస్తూ ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేదిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా 60శాతం నమోదయ్యే ప్రయాణికుల ఆక్యుపెన్సీని వేసవిలో 90-100 శాతం పెంచాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌పోర్టు రూట్‌లో ఆర్టీసీ నడుపుతున్న 50 పుష్పక్‌ బస్సులు, నగర పరిధిలో 40 ఏసీ బస్సుల్లో రాయితీని వర్తింపజేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి గ్రేటర్‌జోన్‌కు కొత్తగా మరో 170 ఈవీ బస్సులు తీసుకువచ్చే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu