Ad Code

అవయవదానాలతో 64 మందికి కొత్త జీవితం కల్పించాం !


ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జీవన్ దాన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాటాడుతూ రాష్ట్రంలో గడిచిన రెండు నెలల్లో జరిగిన అవయవదానాలతో 64 మందికి కొత్త జీవితం కల్పించామన్నారు. అవయవాలను దానం చేస్తున్నవారికి అత్యధికులు 50 ఏళ్ల లోపువారే ఉన్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు పెరగాలని సూచించారు. 2025లో రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2025 సంవత్సరంలో మొత్తం 301 అవయవమార్పిడులు జరిగాయని వెల్లడించారు. 93 మంది బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి అవయవాలు సేకరించగా, వారిలో 69 మంది పురుషులు, 24 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. అవయవదానాల ద్వారా జరిగిన శస్త్రచికిత్సల్లో కిడ్నీల శస్త్రచికిత్సలే అధికంగా ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత కాలేయం, ఊపిరితిత్తులు, గుండె శస్త్రచికిత్సలు జరిగాయని వివరించారు. 

Post a Comment

0 Comments

Close Menu