ఇరాన్ దేశ చరిత్రలోనే అత్యధిక విలువ కలిగిన 10 మిలియన్ రియల్ ల నోటును ప్రవేశపెట్టింది. ద్రవ్యోల్బణం పెరుగడం, కరెన్సీ విలువ వేగంగా క్షీణించడం, ఆర్థిక వ్యవస్థ అస్థిరతపై భయాందోళన నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అందుబాటులోకి తెచ్చిన కొత్త కరెన్సీ నోటు విలువ సుమారుగా 7 డాలర్లు ఉంటుంది. ఇప్పటికే ఈ నోటు చలామణిలో ఉంది. దీంతో చాలా ఏటీఎంలలో డబ్బు అయిపోతుండటంతో, వాటి వద్ద పొడవైన క్యూలు ఏర్పడుతున్నాయి. డిజిటల్ చెల్లింపులను అధికారికంగా ప్రోత్సహిస్తున్నప్పటికీ, "ప్రజలకు నగదు అందుబాటును నిర్ధారించడం" కోసమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఇరాన్ రియల్ విలువ ఒక అమెరికన్ డాలర్‌కు సుమారు 1.6 మిలియన్లకు పడిపోయి, రికార్డు స్థాయి కనిష్టానికి చేరుకుంది. దీంతో కొనుగోలు శక్తిని తీవ్రంగా క్షీణింపజేసింది. దీని ప్రభావంతో గత ఏడాది కాలంలో ఆహార ధరలు రెట్టింపు అయ్యాయి. నిత్యావసర వస్తువులు అంతకంతకూ అందుబాటులో లేకుండా పోయాయి. కుటుంబాలు ప్రాథమిక వినియోగాన్ని తగ్గించుకోవలసి వస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన 5 మిలియన్ రియాల్ బిల్ స్థానంలో 10 మిలియన్ రియల్ నోటు రావడం, కరెన్సీ విలువ వేగంగా పడిపోతున్న తీరును స్పష్టం చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణతో ఇరాన్ దేశంలో ఆర్థిక ఒత్తిడి తీవ్రమైంది. ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి స్థావరాలపై దాడులు, పెరిగిన అనిశ్చితి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలహీనపరిచి, ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయం కల్పించింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో వ్యవస్థకు అంతరాయం కలుగుతుందనే భయంతో వ్యాపారాలు, వ్యక్తులు డిజిటల్ చెల్లింపులకు ఎక్కువగా దూరంగా ఉంటుండటంతో నగదు వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇరాన్‌లో నెలకొన్ని ఈ సంక్షోభం ప్రభావంతో ఇప్పటికే పలు అంశాలు ప్రభావితమయ్యాయి ఇది ప్రతీకాత్మకంగా గొప్పదైనప్పటికీ,అధిక విలువ గల నోట్లు తరచుగా తీవ్రమైన ఆర్థిక అస్థిరతకు సంకేతంగా చెబుతారు. ఇరాన్ 10 మిలియన్ రియల్ నోటును జారీ చేయడం...ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం , యుద్ధం కారణంగా తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రతిబింబిస్తుంది. నగదుపై ఆధారపడటం పెరిగి, విశ్వాసం బలహీనపడుతున్న కొద్దీ, దేశం తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
0 Comments