ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ఖాజీపేట మండలం చిల్లకనుమ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అక్రమ రవాణాకు వినియోగిస్తున్న మూడు వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన దుంగల విలువ మార్కెట్లో భారీగా ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని, ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేశామని పోలీసులు పేర్కొన్నారు.
0 Comments