ఆపిల్ నుంచి బడ్జెట్ సెగ్మెంట్ లో ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కలిగి ఉన్న A18 ప్రో చిప్‌తోనే ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఒక్కసారి పూర్తిగా 16 గంటల వరకు వినియోగించుకోవచ్చని ఆపిల్ చెబుతోంది. 13 అంగుళాల లిక్విడ్ రెటీనా IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 219 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. వీడియో కాల్స్ కోసం 1080p పేస్‌టైమ్ HD వెబ్‌క్యామ్ ను కలిగి ఉంది. వైడ్ స్పెక్ట్రమ్ మైక్రోఫోన్ మోడ్, వాయిస్ ఐసోలేషన్ తో డ్యూయల్ మైక్ సిస్టమ్ ఉంది. మ్యాక్‌బుక్ నియో A18 ప్రో చిప్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ ఇదే చిప్ ను కలిగి ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 చిప్ కలిగిన విండోస్ కంప్యూటర్ తో పోలిస్తే ఈ చిప్ కలిగిన మ్యాక్‌బుక్ 5 రెట్లు వేగవంతమైన పనితీరును అందిస్తుందని తెలిపింది. ఈ ల్యాప్ macOS Tahoe పైన పనిచేస్తుంది. అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌ల్లో మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మొత్తంగా ఈ ల్యాప్‌టాప్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ మేజిక్ కీబోర్డును కలిగి ఉంది. అయితే కేవలం 512GB స్టోరేజీ వేరియంట్ మాత్రమే Touch ID ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 6, వైఫై 6E, USB-C 3.0, USB-C 2.0 పోర్టులు ఉన్నాయి. దీంతోపాటు హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. స్పేషియల్ ఆడియో సపోర్టుతో డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఇది 36.5Wh బ్యాటరీని సపోర్టు చేస్తుంది. 20W ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 11 గంటల వెబ్ బ్రౌజింగ్ లేదా 16 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్ కోసం వినియోగించుకోవచ్చని ఆపిల్ చెబుతోంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,900 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.79,900 గా ఉంది. విద్యార్థులకు రూ.10000 డిస్కౌంట్‌ను అందిస్తామని ఆపిల్ తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది. మార్చి 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ మ్యాక్ బుక్ బ్లస్, ఇండిగో, సిల్వర్, సిట్రస్ కలర్ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో లభిస్తుంది.
0 Comments