కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా ఆదూర్ కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేష్మా ( చిన్ను పాపు) అద్దెకుంటున్న వసతి గృహంలో అనుమానాస్పదంగా మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నారు. ఆమె చిన్ను పాపు అనే పేరు మీద సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 50కి పైగా యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తోన్నారామె. అందులో ఉండే క్యారెక్టర్ల పేర్లను తన నిక్ నేమ్ గా పెట్టుకున్నారు. ఈ మధ్యాహ్నం కాసర్‌గోడ్‌లోని చూరి ప్రాంతంలోని ఆమె నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ప్రాథమికంగా పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో చురుకుగా ఉంటూ రెండు లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారామె.
0 Comments