Ad Code

రూ. 7.5 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన మసీదు బాధ్యత తీసుకున్న లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ


కేరళ కాసరగోడ్‌లోని కునియాలో జరిగిన 'సమస్త కేరళ జమ్ ఇయ్యతుల్ ఉలమా' సమ్మేళనానికి లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ హాజరై  ప్రసంగిస్తూ  సమస్త సంస్థకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని, సంస్థకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులను నా ముందు ఉంచారు. అందులో ఏదైనా ఒక దానిని నేను స్వీకరించకపోతే జిఫ్రీ తంగల్ బాధపడతారు. అందుకే, సుమారు రూ. 7.5 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన మసీదు బాధ్యతను నేను తీసుకుంటున్నాను. ఒకవేళ నిర్మాణం పూర్తయ్యేసరికి ఖర్చు అంతకంటే ఎక్కువైనా సరే, పూర్తి నిధులు నేనే సమకూరుస్తాన ని ఆయన వాగ్దానం చేశారు. మరో భారీ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వంతో మాట్లాడి సహాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను కూడా సమస్త నడిపే మదర్సాలోనే చదువుకున్నానని ఈ సందర్భంగా యూసఫ్ అలీ గర్వంగా చెప్పుకొచ్చారు. అలాగే తనకు, తన కుటుంబానికి మత పండితులతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "సమస్త అధ్యక్షుడు జిఫ్రీ ముత్తుకోయ తంగల్ నన్ను ఆహ్వానించడానికి స్వయంగా నా కార్యాలయానికి వచ్చారు. మీరు ఒక్క మాట చెబితే నేనే వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని కదా, ఎందుకు ఇంత శ్రమ తీసుకున్నారు అని నేను అడిగాను. తప్పకుండా ఈ సమ్మేళనానికి వస్తానని అప్పుడే మాట ఇచ్చానని ఆయన తెలిపారు.




Post a Comment

0 Comments

Close Menu