దేశీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 70e స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఇందులో 4 జీబీ + 128 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 12,999 ప్రైస్ తో మరియు హై ఎండ్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 14,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లైమ్ లైట్ గ్రీన్ మరియు స్పాట్ లైట్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ. 500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 12,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ అఫీషియల్ సైట్ లో ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 70e ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ PLS LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 260 PPI మరియు 16M కలర్ డెప్త్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 6300 తో నడుస్తుంది. అలాగే, ఈ ఫోన్ 4 జీబీ / 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 30FPS వద్ద FHD (1920 x 1080) వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు స్లోమోషన్, నైట్ మోడ్ వంటి అదనపు ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది.
0 Comments