Ad Code

నటి ప్రత్యూష హత్య కేసు : సిద్దార్థ్ రెడ్డి పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు


సినీ నటి ప్రత్యూష  హత్య కేసులో సిద్దార్థ్ రెడ్డి పిటీషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు  తీర్పుపై నటి ప్రత్యూష తల్లి సరోజినిదేవి స్పందించారు. సరోజిని దేవి మాట్లాడుతూ “నాకు న్యాయం జరగలేదు.. నా కూతురు చంపబడిందనే చెబుతున్నాను.. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవితం ఖైదు పడేది. ముని స్వామి రిపోర్టును కోర్టులు కన్ఫార్మ్ చేయలేదు. ఆ రిపోర్టు తీసుకొని ఉంటే బాగుండేది. త్రిసభ్య కమిటిని ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించారు. ప్రత్యూష డెడ్ బాడీని చూడలేదు ఎలా చనిపోయిందో ఆ కమిటీ వాళ్ళకి తెలియదని” సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యూష హీరోయిన్‌గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుందని తెలిపారు. ఎంతో హార్డ్ వర్క్ చేసింది, మూడేళ్లలో 22 సినిమాలు చేసిందని ప్రత్యూష తల్లి వెల్లడించారు. కాని సిద్దార్థ్ రెడ్డి ప్రత్యూష హీరోయిన్ గా ఎదిగితే తనకు దక్కదని భావించాడు. అందుకే ఆమెను అత్యాచారం చేసి హత్య చేశాడని తెలిపారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరూ కుక్క చావు చస్తారంటూ భావోద్వేగానికి గురయ్యారు. వాళ్లంతా పైకి వెళ్ళి ప్రత్యూష కాళ్ల మీద పడతారని సరోజిని దేవి వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu